తెలంగాణలో మరో వ్యక్తి కరోనాతో మృతి


హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో కరోనావైరస్ రోగి మృతి చెందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ వెల్లడించారు. అయితే అదే వార్డులో ఉన్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడి చేశాడని, వైద్యులపై దాడి చేయడం సరికాదని ఆయన అన్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ఆయన.. సంయమనంతో వ్యవహరించి కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ప్రస్తుత మరణంతో ఏడవ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వందకు చేరువలో కరోనా కేసులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ప్రస్తుత మరణంతో ఏడవ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వందకు చేరువలో కరోనా కేసులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments