నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది టైలర్ షేక్. ఉమర్
చింతపల్లి April 6(షేక్. కాశిమ్ వలీ): - పెట్టే గుణముంటే పేదరికం అడ్డు రాదని నిరూపించాడు చింతపల్లి గ్రామానికి చెందిన టైలర్ షేక్. ఉమర్. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తున్న డం వల్ల పనులు లేక పస్తులుంటున్న అభాగ్యులను తనవంతు సాయం చేయాలని ఆలోచన చేశాడు. తనను పేదరికం వెంటాడుతున్నా పెద్దమనసుతో ఆలోచించి ఇప్పటికే తన సొంత నిధులు, స్వయంకృషితో సుమారు వెయ్యి మాస్క్ లు స్వయంగా కుట్టి పంపిణీ చేశాడు. అలాగే మరో ముందడుగు వేసిన ఆయన వృద్యాప్యయంతో బాధపడుతున్న షేక్.మదీనమ్మ, షేక్. పీర్బీ అనే తల్లికూతుళ్ళకు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాలం చేసిన దర్జీ షేక్. అబ్బులు కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు.
0 Comments