ఏపీ ట్రాన్స్ కో, ఈపీడీసీఎల్ పై ఎస్మా

అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ట్రాన్స్‌కోలోని ఎపీఈపీడీసీఎల్, ఎపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లో ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా ఎస్మాను ప్రయోగించింది. గత ఏడాది ఆగస్ట్‌లో విధించిన ఎస్మా గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో మరోసారి ఎస్మా (అత్యవసర సేవల నిర్వహణ చట్టం 1971) ప్రయోగించింది. దీంతో మరో ఆరు నెలల పాటు ట్రాన్స్‌కోలో ఎస్మాను ప్రయోగించాలని చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నుంచి సూచనలు రావడంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మరో ఆరు నెలల పాటు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎస్మా పరిధిలో ఉంటారు. వారు ఎలాంటి సమ్మెలు చేయడానికి వీలు ఉండదు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.








Post a Comment

0 Comments