నర్సీపట్నం, ఏప్రిల్ 6:
విశాఖ ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం లో రెండు కరోనా వైరస్ పాజిటివ్ లు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఏజెన్సీ లో మతప్రచారం నిర్వహించేందుకు పది మంది (ఐదుగురు భార్యా, భర్తలు ) మర్చి 19న తమిళనాడు నుంచి నర్సీపట్నం వచ్చారు. ఈవిషయం తెలుసుకున్న అధికార యంత్రంగం హుటాహుటిన ఏప్రిల్ ఒకటి న విశాఖపట్నం క్వారంటైన్ కి తరలించారు. ఈ పదిమందిలో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈమేరకు తమిళనాడు వ్యక్తులు బసచేసిన నర్సీపట్నం కోమటవీధిని రెడ్ జోన్ గా ప్రకటించినట్టు కరోనా నియంత్రణ అధికారి, సిఐడి అడిషనల్ డిజి సునీల్ కుమార్ ప్రకటించారు.
0 Comments