నర్సీపట్నం(విఎస్ జె ఆనంద్): నర్సీపట్నం మండలం పరిధిలో ఖాళీగానున్న రెండు గ్రామ వలంటీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో ఎన్. జయ మాధవి తెలిపారు. శనివారం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మండలం పరిధిలో ధర్మసాగరం గ్రామ పంచాయితీలో 9వ నంబర్, ఎరకన్న పాలెం గ్రామ పంచాయితీలో ఏడవ నంబర్ గ్రామ వలంటీర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన అర్హులైన అభ్యర్థులు https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీన వెబ్ సైట్ ఓపెన్ అవుతుందని, 24 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది అన్నారు. ధర్మసాగరం పోస్ట్ బిసి-బి, ఎరకన్నపాలెం పోస్ట్ బిసి-డి కులా లకు రిజర్వ్ చేయబడిందని తెలిపారు. గ్రామ వలంటీర్ పోస్ట్ కి దరఖాస్తు చేసుకునేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులై 2020 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలు లోపు ఉండాలన్నారు . దరఖాస్తుతోపాటు స్థానికత నిర్ధారణ కోసం రేషన్ కార్డు గాని, ఆధార్ కార్డు గాని, నివాస ధ్రువీకరణ పత్రంగాని సమర్పించాలన్నారు . కులధ్రువీకరణ పత్రం తప్పని సరిగా జత పరచాలన్నారు. గ్రామ వలంటీర్ల దరఖాస్తులను 25న పరిశీలించి, 27 నుంచి 29 వరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేవలం అర్హతలు ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు విధుల్లో చేరుటకు మే 1న ఎంపిక పత్రం ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామ వలంటీర్ల నియామకాలపై పూర్తి సమాచారం కోసం 9849900151, 9052741584 నంబర్లను కాల్ చేయవచ్చునని ఎంపీడీవో తెలిపారు.
0 Comments