రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ శుక్రవారం అందనున్నాయి. పింఛన్, వేతనాల చెల్లింపుపై ఆర్థికశాఖ, సీఎఫ్‌ఎంఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందంటూ ఉద్యోగుల వేతనాల్లో 10శాతం నుంచి 60శాతం వరకు, మరికొందరికి పూర్తిగానూ కోత వేసి మిగిలిన మొత్తాల్నే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి జీవో ఇచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తదనుగుణంగా చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో అందరికీ 3వ తేదీన వేతనాలు, పింఛన్ల చెల్లింపులు జరుగుతాయని అధికారులు అంటున్నారు.
0 Comments