సబ్బులు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేస్తున్న సి ఐ సన్యాసి నాయుడు
చింతపల్లి ఏప్రిల్ 11(షేక్ కాశిమ్ వలీ) : లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండగా వారికి రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ బాపూజి ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూరల్ పోలీసు స్టేషన్లకు సబ్బులు, శానిటైజర్లు, మాస్క్ లు పంపించారు. ఈ మాస్క్ లు, శానిటైజెర్లను పోలీసులకు చింతపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సన్యాసి నాయుడు పంపిణి చేసారు. ఉన్నతాధికారులు మాస్క్ లు, సబ్బులు, శానిటైజర్లు సరఫరా చేయడం పై పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ షరీఫ్ మహమ్మద్ ఆలీ పాల్గొన్నారు.
(అన్వేషణ)
0 Comments