మారుమూల గ్రామాల నిరుపేద గిరిజనులకు నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ

చింతపల్లి, ఏప్రిల్16( షేక్ కాశిమ్ వలీ):లాక్ డౌన్ పొడిగింపుతో పనులు చేసుకునే పరిస్థితి లేక ఆకలితో ఇబ్బంది పడుతున్న  మారుమూల గ్రామాల్లోని గిరిజనులను ఆదుకునేందుకు ఆలిండియా చర్చిస్ ఆఫ్ క్రైస్ట్ ముందుకొచ్చింది. విజయవాడకు చెందిన డీ. రత్నకిశోర్ ఆర్థిక సహాయంతో స్థానిక యువకుడు బీఏ క్యాంప్ బెల్  ఆధ్వర్యంలో  చింతపల్లి, జీ కే వీధి మండలాలలో ఎంపిక చేసుకున్న కొన్ని గ్రామాల్లో నిరుపేద గిరిజనులకు కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ నిర్వహిస్తున్నట్లు క్యాంప్ బెల్ తెలిపారు.

Post a Comment

0 Comments