జీకే వీధి విలేకరులకు ఫైండ్ రైస్ పంపిణీ చేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి విశ్వేశ్వరాజు


విలేకరులకు బియ్యాన్ని అందజేస్తున్న విశ్వేశ్వరాజు
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 1: స్థానిక పాత్రికేయులకు  వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మత్స్యరాస విశ్వేశ్వరాజు ఫైండ్ రైస్  ని పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరు గృహాల కే  పరిమితమయ్యారు.  అయితే  న్యూస్ కవరేజ్ కోసం శ్రమిస్తున్న విలేకర్ల సేవలను గుర్తించిన ఆయన బుధవారం ఒక్కొక్క విలేఖరికి 25 కిలోల ఫైండ్ రైస్  బ్యాగ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విలేకరుల సేవలు అభినందనీయమని, ప్రతి ఒక్కరు గృహాల్లో ఉంటే వైద్యులు, పోలీసులతోపాటు విలేకరులు కూడా న్యూస్ కవరేజ్  కోసం శ్రమిస్తున్నారు అన్నారు . ప్రస్తుత పరిస్థితుల్లో విలేకరులకు కూడా సహాయం అందించాలని తన భార్య , గూడెంకొత్తవీధి వైసిపి జెడ్ పి టి సి అభ్యర్థి శివ నాగ రత్నం సలహా ఇవ్వడంతో వెనువెంటనే ఆచరణలోకి తీసుకున్నానని ఆయన తెలిపారు. అలాగే నిరుపేదలకు కూడా తన వంతు సహాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments