దుకాణాల్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే ప్రజలు ఇది గా సామాజిక దూరం పాటించాలి ఎంపీడీవో ప్రేమాకరరావు.

చింతపల్లి ఏప్రిల్ 8 (షేక్ కాశిమ్ వలీ): దుకాణాల వద్ద కూరగాయలు, నిత్యావసర సరుకుల కొనుగోలు చేసే  ప్రజలు విధిగా సామాజిక దూరం పాటించాలని ఎంపీడీవో  ప్రేమాకరరావు అన్నారు. చింతపల్లి కూరగాయల మార్కెట్ ను  స్థానిక యస్ఐ షరీఫ్ మహమ్మద్ ఆలీ, ఈవో ఆర్ డి శ్రీనివాస్ తో కలిసి బుధవారం ఎంపీడీవో  సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రజలను ఆందోళనకు  గురి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఅమలుపరిచిన లాక్ డౌన్లోడ్ ప్రతి ఒక్కరు తప్పక పాటించాలన్నారు. 144 సెక్షన్ కూడా అమలులో ఉందన్నారు. ప్రజలు సామాజిక భౌతిక దూరం పాటిస్తూ కేటాయించిన నిర్ణీత సమయాల్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. మిగిలిన సమయాల్లో గృహాల కే పరిమితం కావాలని ఆయన సూచించారు.  ప్రజలు  నిబంధనలు అతిక్రమించకుండా గ్రామ వాలంటీర్లు, పోలీసులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

Post a Comment

0 Comments