చింతపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ

చింతపల్లి, ఏప్రిల్ 2: 
మండలంలో గడపరాయి డిఆర్ డిపో పరిధిలో లబ్ధిదారులకు రేషన్ సరుకులను అధికారులు  ప్రయోగాత్మకంగా డోర్ డెలివరీ చేశారు . ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ డీకే ఆదేశాల మేరకు చింతపల్లి ప్రత్యేక అధికారి రవీంద్రనాథ్, ఎంపీడీవో ప్రేమకరరావు, సివిల్ సప్లైస్ డి టి శ్రీనుబాబు సంయుక్తంగా గ్రామ సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్ల సహాయంతో బియ్యం ఇతర నిత్యావసర సరుకులను ఆదివాసీల గృహాల వద్దకు తీసుకుని వెళ్ళి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ.. గడప రాయి జిసిసి,  డిఆర్ డిపో   పరిధిలో   304 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు . ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు తొలిరోజు ఆటోలో 30 కార్డుల  లబ్ధిదారుల గృహాలకు ఉచిత బియ్యం నిత్యావసర సరుకులను తీసుకొని వెళ్ళి పంపిణీ చేశామన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని, పూర్తి నివేదిక పిఓకి సమర్పిస్తాం అన్నారు.    

Post a Comment

0 Comments