చింతపల్లి పట్టణ ప్రజలకు ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్న.. ఏపీ ఫైబర్ ఎంఎస్ఓ రమేష్ చౌదరి..

చింతపల్లి:
లాక్ డౌన్ కారణంగా  ప్రజలు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలకు  తమ వంతుగా సహకారం అందించాలని  ఏపీ ఫైబర్ ఎంఎస్ఓ గుంటుపల్లి రమేష్ చౌదరి ముందుకొచ్చారు. మైదాన ప్రాంతాల నుంచి ఐదు రకాల కూరగాయలను దిగుమతి చేసుకొని పట్టణ ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. గురువారం చింతపల్లి పట్టణ కేంద్రంలో ఎంఎస్ఓ రమేష్ చౌదరి తలపెట్టిన  ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రేమకర రావు ప్రారంభించారు. తొలిరోజు రామాలయం వీధి, సాడికపేట, మసీదువీధి అందులో సుమారు ఐదు వందల కుటుంబాలకు ఐదు రకాల కూరగాయలు అర కిలో చొప్పున పంపిణీ చేశారు. మరో నాలుగు రోజులు పంపిణీ కార్యక్రమానికి కొనసాగిస్తానని, ఉద్యోగులు నిరుద్యోగులు నిరుపేదలు ప్రతి ఒక్కరికి ఈ కూరగాయలను పంపిణీ చేస్తున్నామని, ఇతర వీధులకు రెండు మూడు రోజుల్లో పంపిణీ చేస్తామని రమేష్ చౌదరి తెలిపారు. రమేష్ చౌదరి సమకూర్చిన కూరగాయల పంపిణీకి వర్తక సంఘం నాయకులు పెద్ద రెడ్ల బేతాళుడు, సందీప్, భాస్కర్ సహాయ, సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments