పాడేరు ఏప్రిల్ 5: విశాఖ ఏజెన్సీలో లాక్ డౌన్ ముగిసేంత వరకు వారపు సంతలు జాతరలో సమావేశాలు విందు వినోద కార్యక్రమాలకు అనుమతి లేదని పాడేరు ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి బాలాజీ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాడేరు జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్ మాదిరిగా హుకుంపేటలోను కూరగాయల విక్రయానికి మాత్రమే అనుమతించాలని వారపు సంత కు అనుమతి లేదన్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ నిర్ణీత సమయాల్లో మాత్రమే కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు సామూహిక సమావేశాలు, విందు , వినోద కార్యక్రమాలు, జాతరలు నిర్వహించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో హెచ్చరించారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ నిర్ణీత సమయాల్లో దుకాణాల వద్ద సరుకులను కొనుక్కోవాలని, ప్రజలందరూ గృహాల్లో నే ఉండాలని ఆయన తెలిపారు.
0 Comments