కవిత=(1)..
పాము, పురుగు, పుట్ర పాపమనక తినిన
పాడు రోగమిట్లె పెచ్చరిళ్లు
చైన దేశ జనుల చేష్టలే ఋజువులు
మసలు కొనుడు నెఱిఁగి మేలుకోరి//
పక్క దేశమెల్లి పయిస తెచ్చుడు కాదు
తెచ్చినారు చూడు తెగులు నేడు
జన్మభూమి నందు గంజికూడు మిన్న
పరుల నుండి జబ్బు పొందుకన్న//
పాటియయిన మాట పట్టరీమనుజులు
కల్ల మాటల కొలువు కోరునెపుడు
కష్టమపుడు నెరుగు కల్లమాటెట్టిదో
మోది మాట పట్టుడిప్పుడయిన//
కష్ట కాలమొచ్చె కరోనాయనుతీరు
పొరుగు దేశపోడు పంచెమనకు
కనుక జనులులార కానుకొనుడు
మేలుకొనుడు మీరు మనసు పెట్టి//
నీదు ప్రాణమొకటె నేలరాలుట కాక
నీవు ఒకని వెంట నడుపగలవు
కలసియుండుగాని కాటికెవ్వడురాడు
కాస్త దూరముండు కరుణతోడ//
పాలకుండ్ల పలుకు పాటించకుండిన
చేరవచ్చునోయి చెరుపు పురుగు
మాటపట్టి నీవు మంచిదారి నడిచి
మేలు చేయవోయి మేటి నరుడ//
బతికి ఉన్నవాడు బహుకార్యములొనర్చు
కీడుతేకు తోడు కట్టుకెళ్లి
కాలుకదపకుండ కలసియుండింటను
తొడబుట్టినోళ్ళ తేజమెరిగి//
బాధ్యతెరిగినోడు బయటకేగడిపుడు
కూడియుండి జనుల కుశలమడుగు
కాలుబయట నెడితె కరొనొచ్చునుయన్న
మాటతెలిపి పరుల మేలుకోరు//
చల్లంగి.ప్రవీణ్ కుమార్,
ఉపాధ్యాయుడు,
లమ్మసింగి గ్రామం,
చింతపల్లి మండలం,
విశాఖపట్నం జిల్లా.
చరవాణి:9490260585
కవిత=(2)..
🌹🌷🌹మాకెందుకు ఈ శిక్ష?🌹🌷🌹
పట్టణానికైన పారడానికి ధనములేని మేము,పక్క దేశం వెళ్లగలమా?
పరాయి దేశం నుండి మన దేశానికి ఎవరో తెచ్చిన జబ్బుకి మాకెందుకు ఈ శిక్ష?
పర్వతాలు నాశనం చేసామా?మాకు లభించే ఫలములు లేకుండా చేసుకున్నమా?
ఎవడో జీవహింస చేసి తినకుడాని జీవులు తిని రోగాలు తెచ్చుకుంటే! మాకెందుకు ఈ శిక్ష?
సెలయేళ్ళలో స్నేహితులతో ఆడుకోకూడదా?
ఎవరో ముగా జీవాలతో చెడుగు ఆడుకుంటే,వాళ్ళకొచ్చిన రుగ్మతకు, మమ్ములను ఆడుకోవద్దని నిర్దేశిస్తున్నారు. మాకెందుకు ఈ శిక్ష?
పయిసలున్న వాడు పరుగు పరుగున పోయి,పాడు రోగం తెచ్చుకుంటే ! పేదవాళ్ళను కొండకొనల్లో కలసిమెలసి ఆడకుపాడకు అంటున్నారు. మాకెందుకు ఈ శిక్ష?
పుడమిగర్భం కోసినామా?కోటానుకోట్లనాశించినామా?
పట్టెడన్నo ఉంటే చాలని,పాడిపంటలే తోడునీడని,పురిగుడిసెలో బతుకునీదే, మాకెందుకు ఈ శిక్ష?
జీవమున్న ప్రాణులన్నీ మనసనేది కలిగి ఉండి, పొరుగువారికి సాయపడుటే ధర్మమని ప్రకృతి చెబితే,ఆ దారిలో అడుగులేసే ఈ అడవి బిడ్డలమైన మాకు ఎందుకు ఈ శిక్ష?
మానవాళి మేలుకోరి, భారతావని వెలుగునెంచి,మంచి మనసుతో మసలుకొనుచు,మర్మమెరుగక బ్రతుకు బండిని సాగదీసే మాకెందుకు ఈ శిక్ష?
సూర్యుడు,పాము,చెట్టు,సముద్రము,భూమి,గాలి,నిప్పు,పుట్ట,అన్నింటిలో దైవత్వాన్ని చూస్తు జీవించే మాకెందుకు ఈ శిక్ష?
ఇది ఒక అడవి బిడ్డ ఆవేదన, సగటు గిరిజనునిగా నా అక్రoదన.
కవిత=(3)..
🌹🌷🌹మనం ఏం చేద్దాం🌹🌷🌹
మనసులన్ని ఏకమై
మనషులంతా ఒక్కటై
మనకు కీడు తెచ్చునట్టి
కరోనాను తరుముదాం
బాధ్యతతో మనముందాం
భవిష్యత్తు నిలబెడదాం
భరతావని కీర్తి పెంచు
బాటలోనే పయనిద్దాం
బయమన్నది వదిలేద్దాం
ధైర్యంగా నిలబడదాం
కరోనాను తరిమి కొట్టు
లక్ష్యంతో అడుగేద్దాం
దూరమును పాటిద్దాం
మాస్కులను తొడుగేద్దాం
మన దరికి చేరకుండా
నియమాలు పాటిద్దాం
ముఖమును,కాళ్ళు,చేతులు
సబ్బుతో శుభ్రం చేద్దాం
క్రిములను చేరoగనీక
పరిశుభ్రంగా ఉందాం
పుల్లని పండ్లను తిందాం
ఇమ్మ్యూనిటి పెంచేద్దాo
రోగము మనకడకురాని
ఆహారం తినేద్దాం
వేడిగ నీళ్లను తాగి
గొంతున నిలువుండనీక
ఉదరం చేరేట్లు జేసీ
కరోనాను చంపుదాం
ఆవిరి ఒక విరుగుడంటు
అందరికి చెప్పేద్దాం
అమలు చేస్తే మేలంటు
ప్రేరణ కలిగించేద్దాం
పోలీసుల సేవలను
పారిశుద్ధ్య కార్మికులను
వైద్యుల విలువను తెలిపి
జేజేలు పలుకుదాం
ప్రభుత్వపు నిర్ణయాలు
ప్రాణాలకు రక్షనంటు
ఈ దారుణ రోజులలో
గడప దాటకనుందాం
పైసలు తేవచ్చు గాని
ప్రాణము తేలేమన్న
పెద్దల మాటలనన్ని
ప్రజలకు వినిపించుదాం
ఇంటను కూర్చోనుండక
కొంచెము ఆలోచించి
మేలును పదుగురికి తెలిపే
చింతను చేస్తూ ఉందాం
గడిసెటి రోజులు మరచి
గడవాల్సిన భవిత కొరకు
చక్కని యోచన జెసి
కాలమును గడుపుదాం
కరోనాను తరిమేద్దాం
కరోనాను తరిమేద్దాం
మన పిల్లల భవిష్యత్తు
మనమే కాపాడుదాం
కరోనాను తరిమేద్దాం
కరోనాను తరిమేద్దాం
బంగరు భారత భవితకు
పునాదులు మనమేద్దాం
కరోనాను తరిమేద్దాం
కరోనాను తరిమేద్దాం
భారత ధీరుల ధైర్యము
నలుదిశలా చాటేద్దాం
0 Comments