కరోనా వైరస్ వ్యాప్తి పై నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి .. ఆదివాసీ పరిరక్షణ సమితి కో కన్వీనర్ రాజబాబు.


సమావేశమైన నాయకులు  (ఫైల్ ఫోటో) 

చింతపల్లి ఏప్రిల్ 7(షేక్ కాశిమ్ వలీ): -  కరోనా వైరస్ వ్యాప్తి పై  ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యం  వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది  ఆదివాసీ పరిరక్షణ సమితి కో కన్వీనర్ మొట్టడం రాజబాబు అన్నారు. స్థానిక గిరిజన ఉద్యోగుల భవనంలో జేఏసి ముఖ్య నాయకులతో మంగళవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన్యప్రాంతంలో సోకకుండా ప్రతిఒక్కరు ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు.  ఇప్పటికే ఈ వైరస్ అగ్రరాజ్యాలను అతలాకుతలం చేసిందన్నారు. అగ్రరాజ్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసిన ప్రధాని నరేంద్రమోదీ ముందుచూపుతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను స్వీయనియంత్రణలో ఉండాలని చెప్పడం హర్షనీయమన్నారు. ఈ క్రమంలో గడచిన పదిహేడు రోజులుగా ప్రజలంతా గృహ నిర్బంధంలో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలో మరలా కరోనా కేసులు పెరగడం అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. విశాఖ జిల్లాలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడం, ఈ ప్రబావం మన్యప్రాంతం పై పడుతుందేమోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారన్నారు. ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలోనూ రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రచారం జరగడం మన్యప్రాంతానికి ముప్పుగా బావిస్తున్న నేపథ్యంలో మన్యప్రాంత ప్రజలకు కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన బాధ్యత మనపై ఉందని జేఏసీ నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దేపూరి.శశికుమార్, లోచల.రామకృష్ణ, గెమ్మెల.మోహన్, యూ వీ గి. ముర్ల.వెంకటరమణ. తదతరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments