వైద్యులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి బాలరాజు
ఆదివాసీలకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై వైద్యులు అవగాహన కల్పించాలని, రోగులకు సిహెచ్ సి లో మెరుగైన వైద్య సేవలందించాలని వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. సోమవారం మాజీ మంత్రి స్థానిక సామజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ఆస్పత్రిలో తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. రోగులకు అందుబాటులోనున్న సదుపాయాలు, వైద్యులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ చింతపల్లి, జీకేవీధి మండలాల ప్రజలకు స్థానిక సిహెచ్ సి పెద్దదిక్కుయని అన్నారు. ఆస్ప్రత్రిలో రోగులకు వైద్యులు అందుబాటులో ఉండడం, కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవడం, సిబ్బందికి, వైద్యులకు మాస్కులు, శానిటైజెర్లు ప్రభుత్వం సమకూర్చడం సంతోషకరమన్నారు.

బాలింతలతో మాట్లాడుతున్న బాలరాజు
రాష్టంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ప్రజలు ఆహరం కోసం ఇబ్బంది పడకుండగా ఉచితంగా రేషన్ పంపిణి చెయ్యడం తోపాటు ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి రూ. వెయ్యి నగదు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి మూడు మస్క్ లు పంపిణీచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. గిరిజన ప్రాంత ప్రజలు ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, విఫత్తు ఆర్ధిక సహాయం పూర్తీ స్థాయిలో ప్రజలకు అందించేందుకు ప్రాంతీయ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోని బాధ్యతాయుతంగా పంపిణి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోని రావాలన్నారు. ప్రభుత్వం సూచిస్తున్న సహాలు , నిబంధనలు ప్రజలందరూ పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమం లో సిహెచ్ సి డిసిహెచ్ డాక్టర్ డి. మహేశ్వర రావు, సీనియర్ డాక్టర్ రఘురాం పాల్గొన్నారు.
0 Comments