చింతపల్లి -నర్సీపట్నం ప్రధాన రహదారి డౌనూరు కరోన వైరస్ వ్యాప్తి నివారణ చెక్ పోస్టు లో శానిటేషన్ ఛాంబర్ ని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం మైదాన ప్రాంతాలు పొరుగు జిల్లాలు రాష్ట్రాల నుంచి ప్రజలు గిరిజన ప్రాంతానికి ప్రవేశించకుండా గా పాడేరు ఐ.టి.డి.ఎ అధికారి బాలాజీ డీకే ప్రధాన రహదారుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజాగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి క్వారంటైన్ విభాగంలో వైద్యులు జారీచేసిన ధ్రువీకరణ పత్రము పొందిన వ్యక్తులను చెక్ పోస్ట్ ల వద్ద అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఈ మేరకు మైదాన ప్రాంతం నుంచి గిరిజన ప్రాంతానికి వెళ్లే వ్యక్తులపై సోడియం క్లోరైట్ 0.01శాతం ద్రావణాన్ని పిచికారి చేసి పంపించేందుకు ప్రత్యేక చాంబర్ ను ఏర్పాటు చేసినట్టు ఆర్ డబ్ల్యూ ఎస్ డీఈఈ జి ఆర్ హెచ్ రాజు, తహసిల్దార్ గోపాలకృష్ణ తెలిపారు.
0 Comments