చింతపల్లి ఏప్రిల్ 7 (షేక్. కాశిమ్ వలీ) : కరోనా వైరస్ నియంత్రణ అత్యంత కీలక దశలో ఉన్నామని, దీనికి ప్రజలు సహకరించాలని వైద్యురాలు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ పసుపులేటి దర్శిని అన్నారు. విలేకరులకు పంపిన ఒక ప్రకటనలో లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరికొంతకాలం ఇలానే ప్రభుత్వాలకు సహకరించాలన్నారు. తమకేం కాదనే భావన సరైంది కాదన్నారు. వైధ్యులపై దాడి సరైంది కాదన్నారు. వైధ్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే వారిపై దాడి చేయడమేమిటని ప్రశ్నించారు.ఈ ఘటనను హేయమైన చర్యగా ఆమె అభివర్ణించారు.ఈ కష్ట కాలంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన తరుణమన్నారు.కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించడమే మేలన్నారు. తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఎక్కువమంది గుమిగూడి ఉండరాదని,కొత్త వ్యక్తుల సంచారాన్ని గమనించి అటువంటి వారికి దూరంగా మెలగాలని సూచించారు. ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకకూడదని అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు. వ్యాధి కారకాలు.. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.. కాబట్టి తెలియని వారికి అంత సన్నిహితంగా మెలగడం మంచిది కాదన్నారు..వ్యాధి తీవ్రత బట్టి చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మంచిదన్నారు. ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బు, లేదా క్రిమిరహిత శానిటైజర్లతో శుభ్రంగా కడుగుతూ ఉండాలన్నారు. కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రతీ ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని కోరారు. లాక్ డౌన్ పాటించి ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రదాన మంత్రి మోది పిలుపు మేరకు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించి దేశ సమైక్యతను చాటి చెప్పడం అబినందనీయమని ఆమె కొనియాడారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు పాటించి కరోనా కేసులు పెరగకుండా ప్రతీఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.
0 Comments