ఆర్ఐ సత్యనారాయణ కు అభినందనలు వెల్లువ ..పదివేల మాస్కులు పంపిణీ..

గూడెంకొత్తవీధి ఏప్రిల్ 2
ఆయన స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ గా పనిచేస్తున్నారు. సుమారు 15 సంవత్సరాలుగా పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ  ప్రాంతీయ ప్రజలు,ఆదివాసీలు, సహోద్యోగులు, అధికారుల మన్ననలు అందుకుంటున్నారు. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. అయితే గిరిజన ప్రాంత ప్రజలు రాస్కులు కొనుక్కునే పరిస్థితి వారికి లేదు. ఆదివాసులకు మాస్కులు అందుబాటులో కూడా లేవు. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్ఐ వ్యక్తిగత నిధులతో  మాస్కులు కుట్టించే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు గిరిజన గ్రామాల్లోనూ, ప్రధాన రహదారుల వద్ద ప్రజలకు మాస్క్ లను పంపిణీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు .. వివరాల్లోకి వెళితే  కొయ్యూరు మండల కేంద్రానికి చెందిన దుమంతి వీర వెంకట సత్యనారాయణ విఆర్వో గా విధుల్లోకి చేరారు. పలు పదోన్నతులు పొందిన ఆయన ప్రస్తుతం గూడెంకొత్తవీధి మండల రెవెన్యూ కార్యాలయం లో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు . గతంలో ఆయన గిరిజన గ్రామాల్లో తన వ్యక్తిగత నిధులతో సుమారు 50 వేల మొక్కలను నాటించారు. నిరుపేద గిరిజన విద్యార్థులను దత్తత తీసుకొని చదివించారు. పండగలు, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో నిరుపేదలకు దుస్తుల పంపిణీ చేస్తున్నారు. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన తన వేతనంలో 20 శాతం ప్రతి నెల కేటాయిస్తున్నారు. తాజాగా రెండేళ్లుగా అవయవ దానం పై గిరిజన ప్రాంతంలో  అవగాహన కల్పిస్తూ 600 మందిని అవయవదానానికి అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు . ప్రస్తుతం ఐదు రోజులుగా గూడెంకొత్తవీధి మండలం లో గిరిజన గ్రామాలను సందర్శిస్తూ మనుషులను పంపిణీ చేస్తున్నారు . మాస్కులు లేకుండా రహదారిపై ప్రయాణించే వ్యక్తులకు సైతం ఆయన స్వయంగా అందజేస్తున్నారు. ఆర్ ఐ  సత్యనారాయణ వ్యక్తిగతంగా చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను ప్రాంతీయ ప్రజలు , అధికారులు, అభినందిస్తున్నారు.

Post a Comment

0 Comments