విధి నిర్వహణ లో ఓ వలంటీర్! వారే నేటి హీరోలు...

పింఛన్ పంపిణీ చేస్తున్న వలేంటీర్

(అన్వేషణ తెలుగు న్యూస్ కి  ఓ అధికారి పంపించిన కవిత)

కొందరు వాళ్ళని పనికిరాని వలంటీర్లు అన్నారు? 
కానీ యాభై ఇల్లు దత్తత తీసుకున్న శ్రీమంతులు వాళ్ళు!

కొందరు వారికి చదువులేదు అన్నారు? 
లోకానికి వారి సేవతో బోధన చేస్తున్నారు! 

వారి జీతమెంత, జీవితమెంత అన్నారు? 
కానీ వారు జీవితాల్ని కాపాడే పనిలో నిమగ్నమయ్యారు! 

వారిని పోకిరి వెదవలన్నారు? 
పేద్ద జ్ఞానులం అని విర్రవీగే వారికి, 
వారి పనులతో బుద్ధి చెబుతున్నారు! 

సిగ్గులేని సమాజానికి,
సైనికుడిలా పని చేస్తున్నారు
సేవకుడనే పేరుకు జీవం పోస్తున్నారు. 

లోకమంత గొళ్ళెం పెట్టుకు గుర్రు పెడుతుంటే
అలుపెరుగని సిపాయిలయ్యారు! 

ప్రాణాలు పోతాయని ఆరోగ్య సంస్థ చెబుతున్న
సేవ చేయలేని మనిషి నిజంగా వ్యాధి గ్రస్తుడే అని ముందుకు నడుస్తున్నారు...

వారే నేటి హీరోలు...

Post a Comment

0 Comments