కూతురు జన్మదినం పురస్కరించుకొని నర్సీపట్నం చెందిన ఉపాధ్యాయలు జయరావు దంపతులు రోగులకు పాలు ,రొట్టెలు పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే..నర్సీపట్నం చెందిన ఉపాధ్యాయుడు జయరావు రావికమతం మండలంలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
ఆయన భార్య సావిత్రి అనంతగిరి మండలం పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ వి గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్ర వారం ఉపాధ్యాయ దంపతుల కుమార్తె ప్రశాంతి జన్మదినం పురస్కరించుకొని జయరావు, సావిత్రి దంపతులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు రొట్టెలు అందజేశారు. ఈ మేరకు రోగులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments