పోలీసులపై మావోయిస్టుల సంచలనాత్మక నిర్ణయం ..



విశాఖపట్నం ఏప్రిల్ 5:
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై సిపిఐ మావోయిస్టు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు . మల్కనగిరి కోరాపుట్ విశాఖ డివిజన్(MKV) కమిటీ కార్యదర్శి కైలాసం ఆదివారం సాయంత్రం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.ప్రధానంగా ఈ కాలంలో మావోయిస్టు పార్టీ నుంచి గాని, పి ఎల్ జి ఏ, ప్రజా సంఘాల నుంచి గాని  పోలీసులపై ఇటువంటి దాడులకు పూనుకోవాలని కైలాసం ప్రకటించారు. అయితే పోలీసుల నుంచి దీనికి భిన్నంగా కార్యాచరణ ఉంటే తప్పని సరి  పరిస్థితుల్లో ప్రతిఘటించిన తప్పదని కైలాసం పేర్కొన్నారు .ఈ విషయమై ప్రభుత్వ వైఖరి 5 రోజుల్లో గా తెలియపరచాలని కైలాసం డిమాండ్ చేశారు. అయితే ఈ లేఖ పై ప్రభుత్వం పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది .

Post a Comment

0 Comments