బియ్యం, కూరగాయలు పంపిణీచేస్తున్న మాజీ ఎంఎల్ఏ రవిబాబు
అనంతగిరి(ఆనంద్):
కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ప్రజలు చైతన్యవంతులు కావాలని మాజీ ఎంఎల్ఏ డాక్టర్ కుంభ రవిబాబు అన్నారు. మంగళవారం అరకు పార్లమెంట్ పరిధి అనంతగిరి మండలం కొత్తూరు పంచాయితీలో మాజీ ఎంఎల్ఏ పర్యటించారు. తొలుత ఆయన డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గంగవరం, చిట్టాలగరువు గ్రామాల్లో స్థానిక గిరిజనులకు అయన వ్యక్తిగత నిధులతో ఐదు కిలోల బియ్యం, కూరగాయలు పంపిణీచేశారు. అలాగే మాస్క్ లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎంఎల్ఏ రవిబాబు మాట్లాడుతూ చైనా ఉహాన్ నగరంలో వెలుగుచిసిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించిందన్నారు. మన దేశంలోనూ వైరస్ శరవేగంగా విస్తరిస్తుందన్నారు. ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యల వల్ల వైరస్ వ్యాప్తి అదుపులో ఉందన్నారు. కరోనా వైరస్ కి మందు లేదని, కేవలం నివారణ ఒక్కటే మార్గమన్నారు.
ప్రజలందరూ లాక్ డౌన్ కాలం లో గ్రహాల్లోనే ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూదన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం, సామాజిక దూరం పాటించాలన్నారు. కొన్నాళ్ళు ఓపిక పండితే కరోనా వైరస్ ని జయించగలమన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మే వరకు పొడిగించింది, ఇది ప్రజలకు ఇబ్బందికరమైనప్పటికీ మన ఆరోగ్యం కోసం లాక్ డౌన్ పాటించక తప్పదన్నారు.
ప్రభుత్వం ఈ విఫత్తు కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం, రూ. వెయ్యి ఆర్ధిక సహాయం అందజేస్తుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి మూడు మాస్క్ లు పంపిణీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసికుంటున్నారన్నారు .ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. మాస్క్ లు లేకపోయినా కనీసం చేతి రుమాలైనా కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాద్యాయుడు రామకృష్ణ , వైసీపీ నాయకుడు రాబ్బా శంకర్ పాల్గొన్నారు.

0 Comments