ప్రభుత్వ సహాయం అందించేందుకు కృషి చేస్తా: మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

చింతపల్లి:మండల కేంద్రం కుమ్మరి వీధిలో అగ్నిప్రమాదానికి గృహాన్ని కోల్పోయిన కుటుంబాన్ని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పరామర్శించారు. శుక్రవారం ఆయన కుమ్మరి వీధిలో ఒంటరిగా పర్యటించారు.    బుధవారం ప్రమాదవశాత్తు కుమ్మర వీధిలో   మేరీకృపాబాయి గృహం పూర్తిగా కాలిపోయింది. ఈ మేరకు ఆమెను  బాలరాజు  పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె కు మాజీ మంత్రి హామీ ఇచ్చారు.  


Post a Comment

0 Comments