మద్యం దుకాణాల్లో నిల్వలపై తనిఖీలు

నర్సీపట్నం(విఎస్ జే ఆనంద్) 
నర్సీపట్నం పరిధిలో మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  లాక్ డౌన్ అమలులో ఉండగా  మద్యం అమ్మకాలు జరుగుతుందని కొంతమంది జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల  మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మద్యం దుకాణాల్లో  తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం పరిధిలో ఎక్సైజ్  సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంతోష్ నేతృత్వంలో పలు మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. నర్సీపట్నం సర్కిల్ పరిధి  ఏడు మండలాల్లో 36 మద్యం దుకాణాల నిల్వలు లెక్కింపు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Post a Comment

0 Comments