లాక్ డౌన్ నియమ నిబంధనలను అధికారులు పోలీసులు కఠినతరం చేసిన పట్టణ ప్రాంతాల్లో అమలు పరిచేందుకు నానా హైరానా పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఏజెన్సీలు నిరక్షరాస్యులైన గిరిజనులు లాక్ డౌన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలు నిత్యావసర సరుకులు పొందేందుకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సమయాన్ని కేటాయించింది. దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారులు విధిగా భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజల భౌతిక దూరం పాటించేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం అవుతుంది. గిరిజన ప్రాంతంలో దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని వృత్తాలను గీసి పోలీసులు, అధికారులు ఒకసారి ప్రకటన చేశారు. అయితే అధికారులు, పోలీసులు లేకపోయినా ఆదివాసీలు క్రమంగా ఈ నిబంధనలను పాటిస్తున్నారు. ఆదివారం సీలేరు మార్కెట్లో గిరిజనులు కూరగాయలు కొనుగోలు చేసేందుకు భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లు నిల్చున్న పద్ధతి పలువురిని ఆకర్షించింది. ఆదివాసీల క్రమపద్ధతిని చూసిన పలువురు అభినందనలతో ముంచెత్తారు.
0 Comments