విజయవాడ: విధి నిర్వహణ ఒకవైపు..తల్లి మృతదేహం మరోవైపు. అయితేనేం ఆ ఎస్సై విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చారు. విజయవాడలో ఎస్సైగా పని చేస్తున్న శాంతారామ్.. విజయనగరంలో ఉన్న తన తల్లి మరణ వార్త హతాశులయ్యారు. లాక్ డౌన్ సమయంలో మాతృమూర్తిని కడసారి చూసుకోలేకపోయారు. పెద్ద కొడుకు అయిన శాంతారామ్ పుట్టుడు శోకాన్ని దిగమింగుకొని తాను నిర్వహించాల్సిన బాధ్యతను సోదరుడికి అప్పగించారు. ఆ తర్వాత ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కర్తవ్య నిర్వహణలో లీనమయ్యారు. శాంతారామ్ఎస్సై మాటలు వినండి
0 Comments