నిరాశ్రయులు, యాచకులు ఆకలి తీర్చుతున్న జీకేవీధి ఎస్ ఐ అనీష్


యాచకుడికి భోజనం అందజేస్తున్న ఎస్ ఐ అనీష్ 

గూడెంకొత్తవీధి (అన్వేషణ):
లాక్ డౌన్ కారణంగా పట్టేది అన్నం కోసం విలవిలలాడుతున్న నిరాశ్రయులు, యాచకులకు జీకేవీధి ఎస్ ఐ అనీష్ ఆకలి తీర్చుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు లోకి తీసుకొచ్చాయి. దింతో నిరాశ్రయులు, సాధువులు, యాచకులకు ఆహారం కరువైంది. బస్సు షెల్టార్లు, వీధి చివర లో అన్నం పెట్టె చెయ్యి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన అనీష్ ప్రతి రోజు ఆహారం సిద్ధం చేయించి యాచకులు, సాధువుల వద్దకు వెళ్లి భోజనాలు పెడుతున్నారు. అనీష్ గతం లోను పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరాశ్రయులు, యాచకులు ఆహారం కోసం ఎదురుచూసిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని, సి ఐ మురళీధర్ , పోలీస్ ల సంహారం తో సాధువులకు భోజనాలు పెడుతున్నామని అన్నారు. 

Post a Comment

0 Comments