వ్యక్తిగత పరిశుభ్రత, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ నివారించవచ్చునని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రం నాదెండ్ల వీధుల్లో ఎమ్మెల్యే విడదల రజిని ట్రాక్టర్ నడుపుతూ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ జీవిత కాలం ఎక్కువని, మిగిలిన వైరస్‌లన్నీ గంట సమయంలో వ్యవధిలోపే మరణిస్తే కరోనా వైరస్ 24 గంటలపాటు బతికే ఉంటుందని తెలిపారు. ప్రమాదకరమైన ఇలాంటి వైరస్‌ను అరికట్టాలంటే ఇళ్లు, వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు విధిగా పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల మీద గృహాల నుంచి బయటకు రాకూడదు అని ఆమె సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మాస్కులు ధరించాలి అన్నారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సచివాలయ ఉద్యోగులు, పార్టీ నాయకులు ఉన్నారు.
0 Comments