చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామపంచాయతీ కేంద్రానికి చెందిన ఉద్యోగులు, అభ్యుదయ సంఘం సభ్యులు నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆకలి తీర్చుతున్నారు. వివరాల్లోకి వెళితే..కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో దాదాపు 20 రోజులపాటు ప్రజలందరూ గృహాల కే పరిమితమయ్యారు. గిరిజన ప్రాంతంలో అధికార యంత్రాంగం వారపు సంతలను రద్దు చేసింది. గ్రామాల్లో ఉన్న చిన్న చితక దుకాణాలు సరుకులు లేక మూతబడ్డాయి. జిసిసి డిఆర్ డిపోల ద్వారా బియ్యం ప్రభుత్వం బియ్యం పంపిణీ చేసినప్పటికీ కుటుంబ సభ్యులందరికీ పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద గిరిజనులు నిత్యావసర సరుకులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ మేరకు నిరుపేద కుటుంబాలకు తమ వంతుగా ఎంతోకొంత సహాయ పడాలని చౌడుపల్లి ఉద్యోగులు గ్రామ అభ్యుదయ సంఘం సభ్యులు వ్యక్తిగతంగా నిధులను సమకూర్చుకొని 48 కుటుంబాలకు అరకిలో చొప్పున శనగపప్పు, పంచదార ,వంట నూనె, ఉప్పు, ఉల్లిపాయలు ,వంకాయలు, ఉప్మా రవ్వ, పది కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, శానిటైజర్ బాటిల్స్ ని చింతపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సన్యాసి నాయుడు, గ్రామ పెద్దల చేతులమీదుగా పంపిణీ చేశారు. కష్టకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన చౌడుపల్లి ఉద్యోగులు, గ్రామ అభ్యుదయ సంఘం సభ్యులకు లబ్ధిదారులు అభినందనలు తెలిపారు.

0 Comments