ఆదివాసీలు గ్రామాలకు ఇతరులను రానివ్వకండి :ఎపి గిరిజన సమాఖ్య రాష్ట్రప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు


గూడెంకొత్తవీధి ఏప్రిల్ 2: మన్యం ఆదివాసీలు గ్రామాలకు ఇతర వ్యక్తులను రానివ్వ రాదని  ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు అన్నారు. గురువారం ఆయన గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ పంచాయతీ కడుగుల,జర్రెల పంచాయతీ జె. కొత్తూరు, రాచకోట గ్రామాల్లో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గడగడ వణికీస్తున్న కరొనా వైరస్ రాష్ట్రంలో పడగ విప్పిందని, దినంలో  గంట గంటకు వైరస్ వ్యాప్తి చెందిన రోగుల  సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు గిరిజన ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతంలో కూడా కరోనా  వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.  ఉపాధి నిమిత్తం మైదానానికి వెళ్ళిన గిరిజనులు  గ్రామాలకు తిరిగి వస్తే వాలంటీర్ల ద్వారా పోలీసు, వైద్య సిబ్బంది , ఎంపీడీవో,తహసిల్దార్కి సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో తమ దృష్టికి అయినా తీసుకొని రావాలని ఆయన తెలిపారు. గంజాయి వ్యాపారులను గిరిజన గ్రామాలకు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఆదివాసీలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల  సిపిఐ కార్యదర్శి కంకిపాటి సత్తిబాబు, రింతాడ మాజీ సర్పంచ్ భాస్కరరావు,జర్రెల మాజీ  ఉప సర్పంచ్ జర్తా చిన్నబ్బాయి, నాయకులు రాజరావు,లక్ష్మణ రాజులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments