మాస్క్‌లు శుభ్రం చేసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి ఉంది..మీకు తెలుసా..?

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఉపయోగించే  మాస్క్‌లు శుభ్రం చేసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి ఉంది. ప్రస్తుతం  బహిరంగ ప్రదేశాలలో మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గృహాల నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్జికల్ మాస్కులు కరోనా వైరస్ నియంత్రణకు పెద్దగా ఉపయోగం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఎన్-95, గుడ్డ తో చేసిన మాస్కులు ధరించడం సురక్షితం. అయితే ఈ మాస్క్‌లను తరచూ శుభ్రం చేసుకోకపోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. సాధారణంగా దుస్తులను శుభ్రం చేసిన రీతిలో మాస్క్‌లను ఉతికితే సరిపోదు. వీటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు కె.విజయ్‌ రాఘవన్‌ సూచించిన చిట్కాలను కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌లో పంచుకుంది. 

శుభ్రం చేసుకునే విధానం.. 

!.ఇంట్లో తయారు చేసిన మాస్క్‌ను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. సబ్బు, వేడి నీటితో ఉతకాలి. ఆ తర్వాత కనీసం అయిదు గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి. అలా చేస్తేనే మాస్క్‌పై ఉన్న క్రిములు నశిస్తాయి.

!. ఒక వేళ ఎండలో ఆరబెట్టే అవకాశం లేకపోతే.. నీటిలో ఉప్పు వేసి ప్రెజర్‌ కుక్కర్‌లో కనీసం 15 నిమిషాలు మాస్క్‌ను ఉడికించాలి. ఆ తర్వాత ఆరబెట్టాలి.

!. ప్రెజర్‌ కుక్కర్‌ సదుపాయం కూడా లేకపోతే.. సబ్బుతో మాస్క్‌ను ఉతికిన తర్వాత ఇస్త్రీ పెట్టెతో ఓ అయిదు నిమిషాలు వేడి చేయాలని సూచించింది.


Post a Comment

0 Comments