చింతపల్లి(అన్వేషణ):
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకం కావాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. లాక్ డౌన్ కారణంగా మంగళవారం అంబెడ్కర్ జయంతిని మాజీ మంత్రి చింతపల్లి తన నివాసంలో జరుపుకున్నారు. అంబెడ్కర్ చిత్రపటానికి అయన పూల మాలవేసి అయన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో అంబెడ్కర్ పోషించిన పాత్ర దేశానికే ఆదర్శమన్నారు. బడుగు బలహీనవర్గాలకే కాక దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోరిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ అని అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
0 Comments