గృహాల్లో నే గుడ్ ఫ్రైడే..చర్చిలో నిర్వహిస్తే చర్యలు


అన్వేషణ: 
క్రైస్తవులు అత్యంత పవిత్ర దినంగా భావించే గుడ్ ఫ్రైడే(మంచి శుక్రవారం) ఈ ఏడాది ప్రతి ఒకరు గృహాల్లోని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో పూజలు, ప్రార్థనలు, విందు, వినోద కార్యక్రమాలు, సమావేశాలను పూర్తిగా రద్దు చేసి సెక్షన్ 144 సిఆర్ పిని అమలు పరచడం జరిగింది. ప్రభుత్వ హెచ్చరికలను ఉల్లంఘించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పాస్టర్లు, పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు ఈ ఏడాది శుక్రవారం జరిగే గుడ్ ఫ్రైడే, ఆదివారం ఆరాధనలను గృహాల్లో నిర్వహించుకోవాలని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా చర్చిలపై ప్రత్యేక నిఘా పెట్టాలని గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా చర్చిలో ప్రార్థన నిర్వహిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కి, మండల అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ క్రైస్తవులు చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తే చట్టం తీసుకునే చర్యలకు బాధ్యులు కాక తప్పదు.

Post a Comment

0 Comments