మీ సేవలు అభినందనీయం..మీకు అండగా మేముంటాం..సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు మాస్కులు పంపిణీ చేసిన వైసిపి అరకు జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్


చింతపల్లి (విఎస్ జె  ఆనంద్):
మీ సేవలు అభినందనీయం..మీకు మేము అండగా ఉంటామంటూ వైసిపి అరకు జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, చింతపల్లి పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి పోతురాజు బాలయ్య గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు మాస్క్ లను ను పంపిణీ చేశారు. శనివారం లోతుగెడ్డ జంక్షన్, రాజు పాకలు, లంబసింగి ప్రాంతాల్లో  ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు గ్రామ వలంటీర్లను సుధాకర్, పోతురాజు బాలయ్య కలిశారు. ఉద్యోగులు ప్రజలకు అందిస్తున్న సేవలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు మాస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  దివ్యదృష్టితో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయం, గ్రామ వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో  చెప్పటానికి కరోనా వైరస్ విపత్తుల కాలంలో ఉద్యోగుల అందిస్తున్న సేవలే ఒక ఉదాహరణ అని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు తాము పూర్తి అండగా ఉంటామని ఆయన చెప్పారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్న పాల్గొన్నారు.   

(అన్వేషణ)

Post a Comment

0 Comments