గ్రామ సచివాలయం ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల సేవలు అభినందనీయం: ఎంపీడీఓ ప్రేమాకర రావు


చింతపల్లి ఏప్రిల్ 8: 
మండలంలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సేవలు అభినందనీయమని చింతపల్లి ఎంపీడీవో  ప్రేమాకర రావు  కొనియాడారు. బుధవారం ఆయన చింతపల్లి ప్రెస్ క్లబ్ లో  విలేకరులతో మాట్లాడారు.   మండలంలో 22 సచివాలయం పరిధిలో  391 మంది గ్రామ వాలంటీర్లు,155 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారన్నారు.  ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్ల సేవలు ఎనలేనివని ఆయన ప్రశంసించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ విధుల్లో భాగంగా గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఓ వైపు ప్రజలను చైతన్య పరుస్తూ మరోవైపు లాక్ డౌన్  నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ వాలంటీర్ సచివాలయ ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల క్షేమం కోసం చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా పని చేస్తున్నారన్నారు. పింఛన్ ప్రభుత్వం పంపిణీ చేసిన రూ .1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తొలి రోజుల్లోనే పంపిణీ చేసి చింతపల్లి  మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత గ్రామ వలంటీర్లు,  గ్రామ సచివాలయ ఉద్యోగులకు దక్కుతుందన్నారు. చెక్ పోస్టులను గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. దుకాణాలు,  కొళాయిలు, నీటి ఊట గడ్డల వద్ద  కూడా ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సేవాభావంతో, చిత్తశుద్ధి గా పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లు , గ్రామ సచివాలయ ఉద్యోగుల ను వ్యక్తిగతంగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments