ఎస్ఐ షరీఫ్ మహమ్మద్ అలీ
చింతపల్లి ఏప్రిల్ 8 (షేక్ కాశిమ్ వలీ): లాక్ డౌన్ సమయంలో నిరాశ్రయులు, యాచకులకు భోజనాలను సమకూర్చుతూ చింతపల్లి, అన్నవరం పోలీసులు దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ మేరకు సాధువులు, యాచకులకు ఆహారం లభించక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆహారం లభించని వ్యక్తులకు స్థానిక ఎస్ఐ షరీఫ్ మహమ్మద్ అలీ భోజనాలను సమకూర్చుతున్నారు. అలాగే అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్సై ప్రశాంత్, పోలీసులు నిరాశ్రయులు, సాధువులు, యాచకులకు భోజనాలు పెడుతున్నారు. ప్రస్తుత కష్టకాలంలో సాధువులు, యాచకుల కడుపు నింపుతున్న పోలీసులను ప్రాంతీయులు అభినందిస్తున్నారు.
ఎస్సై ప్రశాంత్
0 Comments