కాగడా వెలిగించి ఐక్యతను చాటిన మాజీ మంత్రి బాలరాజు


చింతపల్లి ఏప్రిల్ 5: 
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు చింతపల్లి  పట్టణ కేంద్రం ఐటిడిఏ క్వార్టర్స్ లో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కాగడా వెలిగించి ఐక్యతను చాటారు. ఆదివారం రాత్రి 9 గంటలకు మాజీమంత్రి కుటుంబ సభ్యులతో గృహం బయటకు వచ్చి కాగడాలు, దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మనోధైర్యం, ఐక్యత తో ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కొందాం అని  ఆయన పిలుపునిచ్చారు. 

Post a Comment

0 Comments