చింతపల్లి April 6(షేక్. కాశిమ్ వలీ): - ఎన్నికల కమిషన్ ముందు చూపుతోనే కరోనా ముప్పు తగ్గిందని తెదేపా నాయకురాలు,ఆ పార్టీ చింతపల్లి జడ్పీటీసీ సభ్యురాలు చల్లంగి. జ్ఞానేశ్వరి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబావంతో అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలం అవుతున్న తరుణాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారన్నారు. అవగాహన లేని రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వ్యక్తిపై కోర్టును ఆశ్రయించి అబాసు పాలైందన్నారు. ఎన్నికల కమిషనర్ తీసుకున్న ముందస్తు నిర్ణయం అబినందనీయమనీ, ఆ తరువాతే కేంధ్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిసాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినట్లు మూర్కంగా వ్యవహరించి ఉంటే స్థానిక సంస్థలు ముగిసే లోపే కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగానే గాక దేశవ్యాప్తంగా చుట్టేసేదని ఆమె అబిప్రాయం వ్యక్తం చేశారు.
0 Comments