సబ్ యూనిట్ అధికారి చిన్నబ్బాయి అకాల మరణం బాధాకరం..ఆయన కుటుంబాన్ని శాఖాపరంగా పూర్తిగా ఆదుకుంటాం : ఎడిఎంహెచ్ ఓ డాక్టర్ లీలా ప్రసాద్


చింతపల్లి (అన్వేషణ):
చింతపల్లి మలేరియా సబ్ యూనిట్ అధికారి  చిన్నబ్బాయి అకాల మరణం బాధాకరం,ఆయన కుటుంబాన్ని శాఖాపరంగా పూర్తిస్థాయిలో ఆదుకుంటామని పాడేరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. లీలా ప్రసాద్ అన్నారు. చిన్నబ్బాయి మరణవార్త తెలుసుకున్న ఎడిఎంహెచ్ ఓ అన్వేషణ ప్రతినిధితో మాట్లాడారు. చిన్నబ్బాయి మరణం వైద్య ఆరోగ్య శాఖకు తీరని లోటు అని అన్నారు. 18 ఏళ్ల కిందట వైద్య ఆరోగ్య శాఖలో  ఎంపిహెచ్ డబ్ల్యు (ఎం) గా పెదవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంకడ గ్రామంలో  విధుల్లో చేరారన్నారు. హెల్త్ ఆఫీసర్ పదోన్నతి పొంది చింతపల్లి క్లస్టర్ లో కొంతకాలం పని చేశారని, ప్రస్తుతం చింతపల్లి మలేరియా సబ్ యూనిట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. లాక్ డౌన్ కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నబ్బాయి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా చిన్నబ్బాయి  కుటుంబానికి  అందాల్సిన బెనిఫిట్స్ అందజేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి గుంల్లెలి సింహాద్రి, టిపిఎం సంజీవ్ పాల్గొన్నారు. 
.    

Post a Comment

0 Comments