వివేకానంద విద్యా సంస్థల సేవలు అభినందనీయం.. పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ: మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి

పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలను పంపిణీ చేస్తున్న కమిషనర్ కృష్ణవేణి 

నర్సీపట్నం(విఎస్ జె ఆనంద్ ):
లాక్ డౌన్ కాలంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు సమకూర్చిన వివేకానంద విద్యా సంస్థల సేవలు అభినందనీయమని కమిషనర్ కృష్ణవేణి అన్నారు. బుధవారం  వివేకానంద విద్యా సంస్థల ప్రతినిధులు సమకూర్చిన కూరగాయలను స్థానిక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ అమల్లో ఉందన్నారు.  ఓవైపు ప్రభుత్వం ప్రజలకు పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరు తమకు కలిగిన దానిలో పేదవారికి సహకారం చేయడం మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యాసంస్థల కరస్పాండెంట్ ద్వారా పాల్గొన్నారు.

Post a Comment

0 Comments