నిరక్షరాస్యులైన ట్రైబల్స్ ను చూసి విద్యావంతులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది ...



(అన్వేషణ)
కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అగ్రరాజ్యం సైతం కరోనా వైరస్ కి గడగడా వణికిపోతుంది. భారతదేశం సైతం కరోనా వైరస్ కి  దాసోహం అయిపోయింది. దేశ, రాష్ట్ర పాలకులు,అధికార యంత్రాంగం, వైద్యులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా ఆయుధం లేని సైనికులు వలే కంటికి కనిపించని శత్రువు పై పోరాటం చేస్తున్నారు.  సాటి ప్రజలను కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఆవేదనతో పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రతి ఒక్కరు గృహనిర్బంధంలో ఉండాలని,  భౌతిక దూరం పాటించాలని అధికారులు పాలకులు మొరపెట్టుకున్నారు. అయితే అన్నీ తెలిసిన విద్యావంతులు సైతం అధికారుల సూచనలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఆవేదనకు గురిచేస్తుంది. అయితే ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని గిరిజన గ్రామంలో నిరక్షరాస్యులైన ఆదివాసీ మహిళలు బోర్ వెల్ వద్ద నీళ్లు పట్టుకునేందుకు భౌతిక దూరం పాటిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు . వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లేరు అధికార యంత్రాంగం లేదు . అయినా ఒకసారి గ్రామానికి వచ్చి సూచనలు సలహాలు ఇచ్చిన అధికారి మాటలను ఆదివాసీలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. విద్యావంతుల అందరికీ కరోనా వైరస్ పై నిర్లక్ష్యం గా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఆదివాసీల తీరు కావాలని ఆశిద్దాం. వారిని చూసిన ప్రతి ఒక్కరు మారాలనే ఆశిద్దాం. 

Post a Comment

0 Comments