పంచాయతీ కార్మికులకు బియ్యం పంపిణీ చేసిన సిపిఎం జడ్పిటిసి అభ్యర్థి చిన్నయ్య పడాల్


పంచాయతీ కార్మికులకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్న చిన్నయ్య పడాల్ కుటుంబం 


చింతపల్లి ఏప్రిల్ 5: 
స్థానిక పంచాయతీ కార్మికులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, చింతపల్లి సిపిఎం జడ్పిటిసి అభ్యర్థి bonangi చిన్నయ్య పడాల్ బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  ప్రకటించడం వల్ల కార్మికులు, నిరుపేదలు, దినసరి కూలీలు వస్తువులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు తన వంతుగా పేదలకు సహాయం చేయాలని జడ్పిటిసి అభ్యర్థి కుటుంబం ముందుకొచ్చింది. చిన్నయ్య పడాల్ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత రేషన్ బియ్యంతో పాటు కొంతమంది దాతల వద్ద సేకరించిన బియ్యాన్ని ఆదివారం చింతపల్లి పంచాయతీ కార్మికులకు పంపిణీ చేశారు. అలాగే నిరుపేదలకు ఏదో ఒక రూపాన సహాయం చేయాలని  భావించే వ్యక్తులు 9440896147నంబర్ కి కాల్ చేయాలని ఆయన తెలిపారు . 

Post a Comment

0 Comments