చింతపల్లి:(షేక్ కాశిమ్ వలీ): నిర్భాగ్యులను ఆదుకోవడానికి పేదరికం అడ్డురాదని నిరూపించాడు చింతపల్లి గ్రామానికి చెందిన దర్జీ ఉమర్ (చిన్న) తనకున్నా లేకున్నా తోటివారికి ఏదో రూపాన సహాయపడాలనే తపనతో సొంతనిధులతో మాస్క్ లు కుట్టి పంచడం మొదలు నిరుపేద కుటుంబాలకు తనకు తోచిన రీతిలో నిత్యావసర సరుకులు అందించిన ఆయన మరో అడుగు ముందుకేసి జమాతే ఇస్లాం నుంచి మతపెద్దలు అందించిన నిధులను నిరుపేదలకు ఆర్థిక చేయూతగా అందించారు. అతను నిరుపేదగా ఉంటూ తోటివారి కోసం తాపత్రయపడుతున్న ఉమర్ ను స్థానికులు అబినందించారు.
0 Comments