ఢిల్లీ : కరోనా వైరస్ (కొవిడ్-19) సోకిన ఓ రోగి గురించి సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసినందుకు ఒక మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు మాత్రమే కాకుండా కరోనాకు సంబంధించిన అబద్ధపు ప్రచారాన్ని నిరోధించటానికి ముందుకు రావాలని ప్రభుత్వ రంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19ను గురించి అబద్ధపు సమాచారాన్ని సోషల్ మీడియాలో గమనిస్తే తమకు తెలియచేయాలని సంస్థ యూజర్లను కోరింది. ఇందుకుగానూ ఆ వార్త స్క్రీన్‌షాట్ లేదా లింక్‌ను 87997 11259 అనే వాట్సాప్ నంబరుకు లేదా pibfactcheck@gmail.com మెయిల్ ఐడీకి పంపించాలని పీఐబీ తెలిపింది.
0 Comments