మన్యానికి కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండకుండా అడ్డుకోవాలి.. నేను నర్సీపట్నం నుంచి చింతపల్లి ఏ ఒకరు ప్రవేశించకుండగా నియంత్రించాలి .. నాకు మీ సహకారం అవసరం :'ఏఎస్ పి ఎస్. సతీష్ కుమార్


చింతపల్లి , ఏప్రిల్ 6:టైం 10:45ని.
మన్యానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండగా అడ్డుకోవాలి, నేను నర్సీపట్నం నుంచి ఏ ఒకరు చింతపల్లికి ప్రవేశించకుండగా నియంత్రించాలి, నాకు మీ అందరి సహకారం అవసరమని స్థానిక ఏస్  పి ఎస్. సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు . సోమవారం రాత్రి ఒక విజ్ఞప్తి ప్రకటన విలేఖర్లకు పంపించారు. నర్సీపట్నం లో రెండు కరోనా పాజిటివ్ లు వచ్చిన ఇద్దరితో మరో 18 మంది అతిసన్నిహితగా మెలిగారన్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతకిని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండగా నిరోధించు కోవాల్సిన అత్యవసర పరిస్థితి మన ముందు ఉందన్నారు. ప్రస్తుతం నర్సీపట్నం -చింతపల్లి ప్రధాన రహదారి లో పాలు  మినహా అన్ని రకాల రవాణా శుక్రవారం వరకు నిలిపివేస్తున్నామన్నారు . నర్సీపట్నం నుంచి ఒక్కరిని కూడా గిరిజన ప్రాంతానికి అనుమతించేది లేదన్నారు. డౌనూరు చెక్ పోస్ట్ లో 24 గంటలు పోలీస్, మండల పరిషత్ , రెవిన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ నాలుగు రోజులకు సరిపడిన కిరాణా  సరుకులు, కూరగాయలు దుకాణాలకు తరలించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. చింతపల్లి మండల కమిటీ ఎంపీడీఓ ప్రేమకర రావు, తహసీడర్ గోపాలకృష్ణ కూడా విధుల్లో ఉన్నారన్నారు. అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందజేయాలని అయన కోరారు. 

Post a Comment

0 Comments