కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా స్వ గ్రామ ప్రజలకు తమ వంతు సహాయం అందించాలని ఓ యువ దంపతులు మాస్క్ లను పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే ..చింతపల్లి మండలం కొమ్మoగి పంచాయతీ కేంద్రానికి చెందిన కుడుముల సాయి, అపర్ణ దంపతులు విశాఖపట్నం లో ఉంటున్నారు. అపర్ణ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది. లాక్ డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చిన యువ దంపతులు తమ వెంట కొన్ని మాస్క్ లను తీసుకుని వచ్చారు. గ్రామానికి చెందిన గిరిజనులు మాస్క్లు కొనుక్కునే పరిస్థితి లేదు.ఈ మేరకు సాయి, అపర్ణ దంపతులు ప్రతి గిరిజనుడికి మాస్క్ లను అందజేశారు. సాయి, అపర్ణ సేవలను స్థానిక గిరిజనులు అభినందించారు. పంపిణీ కార్యక్రమంలో గ్రామ యువత రాజేష్, కిషోర్,జ్ఞానేశ్,హరి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
0 Comments