ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధిక ధరలకు సరుకులు అమ్మితే చర్యలు:తహసిల్దార్ గోపాలకృష్ణ

చింతపల్లి (షేక్ కాశిమ్ వలీ) : లాక్ డౌన్ విపత్కర పరిస్థితుల్లో వర్తకులు నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రిని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు.    శనివారం తహసీల్దార్  చింతపల్లి మండల కేంద్రంలో గల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పట్టిక లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది ప్రతి దుకాణం వద్ద ధర్నా పట్టికను ప్రదర్శించారు.  ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారు.  ప్రస్తుత తరుణంలో కూరగాయలు, నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే అధిక భారం పడుతుందన్నారు.  వినియోగదారులకు పై ఆర్థిక  భారం పడకుండగా ప్రభుత్వం ఖచ్చితమైన ధరను నిర్ణయించిందన్నారు. వ్యాపారులు  ప్రభుత్వ  నియమ నిబంధనలను విధిగా పాటించాలన్నారు.  అధిక ధరలకు సరుకులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.

Post a Comment

0 Comments