ప్రియమైన నా ఆదివాసీల రా కరోనా వైరస్ మహమ్మారి తరుముకొస్తోంది..చైతన్యంతో గ్రామాల దరిచేరకుండా అడ్డుకుందాం .. ఆదివాసీ హక్కులు, చట్టాలు పరిరక్షణ సమితి జిల్లా కో కన్వీనర్ ముట్టడం రాజ బాబు


చింతపల్లి ఏప్రిల్ 5:
అడవి తల్లి ముద్దు బిడ్డ లారా..నా ప్రియమైన సోదరీ సోదరులారా, చైనా ఊహ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ మనం ముందుకి ముంచుకొస్తుంది , చైతన్యం కలిగి జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారి మన దరికి చేరకుండా అడ్డుకుందామని ఆదివాసీ హక్కులు చట్టాల పరిరక్షణ సమితి జేఏసీ జిల్లా కో కన్వీనర్ మొట్టడం రాజబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలను నేడు కరోనా వైరస్ వణికిస్తోంది. మనదేశంలోనూ , ఆంధ్రప్రదేశ్,  విశాఖ జిల్లా లోనూ  కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ గిరిజన ప్రాంతానికి వ్యాప్తి చెందకుండా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ డీకే ఓవైపు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఆదివాసీ ప్రజానీకానికి కరోనా వైరస్ పై అవగాహన లేదని, తన ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని భావించినజేఏసీ  ప్రత్యేక కార్యక్రమానికి తెరతీసింది.  ఈ మేరకు ఆదివారం జేఏసీ చింతపల్లి డివిజన్ కన్వీనర్ bonangi చిన్నయ్య పడాల్ , జేఏసీ నాయకులు లోచలి రామకృష్ణ, దేపూరి శశికుమార్,యు వి గిరి, gemmeli మోహన్, పరమేశ్వరరావు జిల్లా కో కన్వీనర్ చింతపల్లి జీకే వీధి మండలాల్లోని పలు మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించారు. కరోనా వైరస్ పై చైతన్యం కలిగిస్తూ గిరిజనులతో సమావేశాలు ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా జెఎసి జిల్లా కో కన్వీనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని , దీనికి మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. ఆదివాసీలు గ్రామాల్లో గుంపులుగుంపులుగా సంచరించ రాదని, నీళ్లకు పొలం పనులకు వెళ్లిన సమయాల్లోనూ ఒక వ్యక్తి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు  . అందరూ కలిసి ఒక చోట చర్చించుకోవడం , సమావేశం ఏర్పాటు చేసుకోవడం పూర్తిగా విడిచి పెట్టాలన్నారు . తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం తో పాటు, ప్రాంతీయంగా లభించే ఆకుకూరలు పప్పుధాన్యాలు అధికంగా తీసుకోవాలి అన్నారు.  ప్రధానంగా ఇతర ప్రాంతాల వ్యక్తులను తమతమ గ్రామాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సందర్శించేందుకు అనుమతించరాదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.   

Post a Comment

0 Comments