చింతపల్లి ఏప్రిల్ 1: పట్టణ కేంద్రానికి చెందిన ఎవెంజర్స్ గ్రూప్ సభ్యులు ఆకలితో ఇబ్బందులు పడుతున్న సాధువులకు భోజనాలు పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయం పాఠకులకు తెలిసిందే. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న సాధువులు ఆకలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన అవెంజర్స్ గ్రూప్ సభ్యులు గురువారం మధ్యాహ్నం సుమారు 20 మంది సాధువులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే లాక్ డౌన్ ముగిసేవరకు ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెడతామని సభ్యులు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎవెంజర్స్ గ్రూప్ సభ్యులు పైలా శ్రీను, దాసరి మచ్చ రాజు, సెల్ పాయింట్ రాజా తదితరులు పాల్గొన్నారు.
0 Comments